
Jyothika: సౌత్ సినిమా పోస్టర్లలో హీరోలకే ప్రాధాన్యత.. సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటి జ్యోతిక మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమపై తన అసంతృప్తిని వెల్లడించారు. ఇక్కడి చిత్ర పోస్టర్లలో నటీమణులకు తగిన స్థానం ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. ఎక్కువగా పోస్టర్లలో కేవలం హీరోల చిత్రాలకే ప్రాధాన్యం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాలు
దక్షిణాదిలో పరిస్థితి పూర్తిగా విరుద్ధం
ఈ సందర్భంగా బాలీవుడ్,మలయాళ సినీ పరిశ్రమల్లో తనకు లభించిన గౌరవాన్ని జ్యోతిక గుర్తుచేసుకున్నారు. హిందీ చిత్రం 'సైతాన్'లో నటించినప్పుడు అజయ్ దేవగన్ ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో స్వయంగా షేర్ చేశారని వివరించారు. అదేవిధంగా,మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటించిన 'కాథల్-ది కోర్' చిత్ర పోస్టర్‌లో తన ఫోటో ఉండటమే కాకుండా, ఆ పోస్టర్‌ను మమ్ముట్టి కూడా తన సోషల్ మీడియాలో పంచుకున్నారని చెప్పారు. కానీ,దక్షిణాదిలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
ఒక్క హీరో కూడా హీరోయిన్ల ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపరని వ్యాఖ్య
ఇక్కడ అనేక మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసినా,ఒక్క హీరో కూడా హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ముందుకు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. "దక్షిణాది సినిమా పోస్టర్లలో ఎల్లప్పుడూ హీరోలకే ప్రాధాన్యం ఉంటుంది,హీరోయిన్ల ఫోటోలు మాత్రం లేకపోవడం విచారకరం"అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇండస్ట్రీలో హీరోయిన్ల స్థానం ఎంత తక్కువగా ఉందన్న ప్రశ్నను మరింత బలపరిచాయి. ప్రస్తుతం జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ,సినీ వర్గాల్లో అనేక రకాల అభిప్రాయాలకు కారణమవుతున్నాయి.