KA Movie Review: 'క' తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. కిరణ్ అబ్బవరం హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా!
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే అనాథ రక్షక నిలయంలో పెరిగిన యువకుడు. తన తల్లి ఎవరా అని ఎప్పటికప్పుడు అన్వేషిస్తుంటాడు. ఓరోజు తన టీచర్ డబ్బుతో పారిపోయి కృష్ణగిరి అనే గ్రామానికి చేరి, అక్కడ పోస్ట్‌మ్యాన్‌గా ఉద్యోగం పొందతాడు. ఈ క్రమంలో పోస్ట్ మాస్టర్ కూతురు (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆ ఊరిలో యువతులు అదృశ్యం అవుతుండడంతో వాసుదేవ్ రాధ అనే టీచర్ కోసం హత్య కేసులో చిక్కుకుపోతాడు. అభినయ టీచర్ డబ్బు కొట్టేసి పారిపోయాడు ఎందుకు? కృష్ణగిరిలో పోస్ట్‌మ్యాన్‌గా చేరడానికి కారణం ఏమిటి? ఇతరుల ఉత్తరాలు చదవడం అతని జీవితానికి ఎలా ప్రమాదకరంగా మారింది?
పెద్ద ట్విస్ట్ లతో ఉత్కంఠను రేపిన మూవీ
తన టీచర్‌కు జరిగిన అన్యాయం తెలుసుకున్న వాసుదేవ్, ఆ రుణాన్ని తీర్చుకునేందుకు ఎలా ప్రయత్నించాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మూవీ మొదటి సీన్ నుంచే ఆసక్తికరంగా సాగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లేతో అందంగా సాగిన ఈ కథ, ఇంటర్వెల్‌లో పెద్ద ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను పంచింది. సెకండాఫ్‌లో కథ మొత్తం వివరిస్తూ, క్లైమాక్స్‌ను గుండెను కదిలించేలా ముగించారు. కిరణ్ అబ్బవరం ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కనిపించాడు. రెండో భాగంలో ఆయన నటన మరింత ఆకట్టుకుంది. తన్వీ రామ్ రాధ పాత్రలో పండించిన ఎమోషన్, నయన్ సారిక పాత్రలు గ్లామర్‌ను తెచ్చాయి.
కిరణ్ అబ్బవరం నటన అద్భుతం
అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్, బలగం జయరామ్ గుర్తుండిపోయే పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా కూడా 'క' సినిమాకు అన్ని అంశాలు బలంగా నిలిచాయి. కథ, కథనం, సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ తన సంగీతంతో మంచి సహకారం అందించాడు. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం పనితీరూ ఆకట్టుకున్నాయి. కిరణ్ అబ్బవరం, దర్శకులు సుజిత్, సందీప్ కలిసి అందించిన ఈ సరికొత్త చిత్రం పండగ సీజన్‌లో థియేటర్‌లో చూసేందుకు కుటుంబమంతా కలసి రావడానికి అద్భుతమైన చిత్రమైన చెప్పొచ్చు.