Page Loader
డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి 
డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కేపీ చౌదరి

డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 14, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత అరెస్ట్ అయ్యారు. రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుని విడుదల చేసిన నిర్మాత కేపీ చౌదరి, మాదక ద్రవ్యాల కేసులో పోలీసులకు పట్టుబడ్డారు. కొన్నిరోజులుగా గోవాలో ఉంటున్న కేపీ చౌదరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర కొకైన్ లభ్యమయ్యిందని సమాచారం. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన నిర్మాత