Page Loader
kajal agarwal : దానికోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నానన్న కాజల్‌.. అవన్నీ ఒకటి, 'సత్యభామ' ఒకటి

kajal agarwal : దానికోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నానన్న కాజల్‌.. అవన్నీ ఒకటి, 'సత్యభామ' ఒకటి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 29, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ స్టార్ నటీమణి విజయశాంతి స్ఫూర్తిగా'సత్యభామలో నటిస్తోంది కాజల్‌ అగర్వాల్‌. ఈ సినిమాలో కాజల్ ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇందుకు సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. ''మేజర్‌' సినిమా తనకు బాగా నచ్చిందని,చూసిన వెంటనే ఆ సినిమా దర్శకుడు శశి కిరణ్‌తో కలిసి పని చేయాలనుకున్నానని కాజల్ మీడియా సమావేశంలో భాగంగా వెల్లడించారు. శశికిరణ్,దర్శకత్సం అందించకపోయినా కనీసం స్క్రీన్‌ప్లే అందిస్తున్నారని, తనకు అది చాలన్నారు. ఈ సినిమా సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఆయన 'సత్యభామ'లో తాను భాగమవడం సంతోషంగా ఉందన్నారు. 'భగవంత్‌ కేసరి' సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన క్రమంలో శశికిరణ్‌ చెప్పిన కథ విని తాను ఆశ్చర్యపోయినట్లు కాజల్ చెప్పుకొచ్చారు.

details

లేడీ స్టార్ విజయశాంతిని స్ఫూర్తిగా పోలీస్ పాత్ర : కాజల్

ఈ నేపథ్యంలోనే కచ్చితంగా సదరు సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నట్లు, అందువల్లే హైదరాబాద్‌కు వచ్చేశానన్నారు. అప్పటి నుంచి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నానన్నారు. బాబును చూసుకుంటూ షూటింగ్స్‌కు హాజరవుతున్నానని, 'సత్యభామ' కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాన్నారు. లేడీ స్టార్ విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకుని యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తాను నటించిన సినిమాలన్నీ ఒకటని, ఇప్పుడు సత్యభామ మూవీ ఒకటన్నారు. ఈ క్రమంలోనే సినిమా చిత్రీకరణ సుమారుగా 65 శాతం పూర్తయిందని కాజల్‌ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. 'భారతీయుడు 2'లోనూ కాజల్ నటిస్తుండటం గమనార్హం.