Page Loader
భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా? 
భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ లుక్

భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 19, 2023
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కాబట్టి భగవంత్ కేసరి నుండి ఆమె లుక్ రిలీజ్ చేసారు. పుస్తకాల గదిలో కూర్చున్న కాజల్, చేతిలో సైకాలజీ పుస్తకం పట్టుకుని ఎడమ చెవికి ఫోన్ పెట్టుకుని ఎవరితో మాట్లాడుతూ నవ్వుతున్న ఫోటోను రిలీజ్ చేసారు. కాజల్ కళ్ళకు పెద్ద కళ్ళద్దాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. లుక్ చూస్తుంటే మధ్య వయసు మహిళ పాత్రలో కాజల్ కనిపిస్తుందేమోనని అనిపిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భగవంత్ కేసరి నుండి కాజల్ అగర్వాల్ లుక్