
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌కి యాక్సిడెంట్.. ఎక్స్ వేదికగా స్పందించిన హీరోయిన్!
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్‌కి (Kajal Aggarwal) యాక్సిడెంట్ అయ్యిందని, పరిస్థితి విషమంగా ఉందంటూ సోమవారం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వాటిపై కాజల్ స్పందిస్తూ తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆ వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం నుంచి కాజల్ యాక్సిడెంట్ గురించి సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ వార్తలతో అభిమానులు ఆందోళనకు గురై ఆమెను ట్యాగ్ చేస్తూ సందేశాలు పెట్టారు. దీనిపై స్పందించిన కాజల్, 'నేను ప్రమాదంలో ఉన్నానని, ఇక లేనని వస్తోన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి.
Details
ఫేక్ వార్తలను నమ్మొద్దు
నిజం చెప్పాలంటే అవి చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే అంతకంటే ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను (Kajal Aggarwal Health Update). ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, ప్రచారం కూడా చేయకండి. ఫేక్ న్యూస్ షేర్ చేయడం కంటే నిజమైన సమాచారం పంచుకోండని నోట్ రిలీజ్ చేశారు. సినిమాల విషయానికి వస్తే.. కాజల్ చివరిసారిగా మంచు విష్ణు హీరోగా నటించిన 'కన్నప్ప' సినిమాలో కనిపించారు. అందులో ఆమె పార్వతీదేవి పాత్రలో పోషించారు. ప్రస్తుతం 'ఇండియన్ 3'లో నటిస్తున్నారు. అంతేకాకుండా రాబోయే 'రామాయణ' చిత్రంలోనూ ఈ అందాల నటి కనిపించనున్నట్లు సమాచారం.