LOADING...
Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఫైర్.. 'హిందువులారా మేల్కోండి' అంటూ ఎమోషనల్ పోస్ట్
బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఫైర్.. 'హిందువులారా మేల్కోండి' అంటూ ఎమోషనల్ పోస్ట్

Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఫైర్.. 'హిందువులారా మేల్కోండి' అంటూ ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వెనకడుగు వేస్తుంటారు. అయితే తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై నటి కాజల్ అగర్వాల్ ఎంతో ధైర్యంగా, భావోద్వేగంగా స్పందించారు. అక్కడ జరుగుతున్న దారుణ సంఘటనలను ఖండిస్తూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అమానుషంగా హత్య చేసి, చెట్టుకు కట్టి తగలబెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ దృశ్యాలను చూసి కలత చెందిన కాజల్, తన ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వ్యక్తం చేశారు.

Details

ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

"హిందువులారా మేల్కోండి.. మీ మౌనం మిమ్మల్ని రక్షించదు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఆకట్టుకున్నాయి. కన్నీళ్ల ఎమోజీలను జోడిస్తూ 'ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో అక్కడ జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన, వివాదాస్పద అంశాలపై సెలబ్రిటీలు మౌనం పాటిస్తుంటారు. కానీ కాజల్ మాత్రం ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా, ప్రాణభయంతో జీవిస్తున్న తోటి మనుషుల కోసం గొంతు ఎత్తారు.

Details

రామయణం చిత్రంలో నటిస్తున్న కాజల్

ఆమె ధైర్యమైన స్పందనపై అభిమానులతో పాటు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "మీరు నిజమైన చందమామ.. ఇతరుల బాధను అర్థం చేసుకుని స్పందించినందుకు గర్వంగా ఉంది" అంటూ ఆమెను కొనియాడుతున్నారు. ప్రస్తుతం 'రామాయణం' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న కాజల్, సినిమాలతో పాటు సామాజిక అంశాల్లోనూ ఇంత చురుకుగా స్పందించడం విశేషంగా మారింది. ఆమె తాజా పోస్ట్ మరోసారి సెలబ్రిటీలు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసేలా చేస్తోంది.

Advertisement