Page Loader
Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన 
Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన

Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన 

వ్రాసిన వారు Stalin
Feb 11, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కల్కి 2898 AD'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. అయితే ఈ మూవీ నుంచి ఒక్క చిన్న క్లిప్ కూడా విడుదల కాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన సంగీతం వైరల్ అవుతోంది. 'కల్కి' మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌‍గ్రౌండ్ స్కోర్‌ని ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లో ప్రదర్శించారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న రెండు నిమిషాల బీజీఎం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'కల్కి' మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో