bigg boss 9 telugu winner: బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల.. ట్రోఫీతో పాటు అదనపు బహుమతి ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్‌ను విజేతగా వ్యాఖ్యాత నాగార్జున అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ అందించిన రూ.20 లక్షల గోల్డెన్ బ్రీఫ్‌కేస్‌ను కూడా తిరస్కరించి, విజయంపైనే నమ్మకంతో చివరి వరకూ నిలబడిన కల్యాణ్.. అదే నమ్మకంతో రూ.35 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందుకున్నారు. ఈ సీజన్‌లో నిర్వాహకులు బిగ్‌బాస్‌కు ముందుగా నిర్వహించిన అగ్నిపరీక్షలో కల్యాణ్ ఒక కామన్‌మ్యాన్‌గా పాల్గొన్నారు. అక్కడే ప్రేక్షకుల మనసులు గెలుచుకుని హౌస్‌లోకి అడుగు పెట్టారు. అలా సామాన్యుల నుంచి హౌస్‌లోకి వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా కూడా కల్యాణ్ ప్రత్యేక గుర్తింపు పొందారు.
Details
సీఆర్పీఎఫ్ జవాన్ నుంచి బిగ్‌బాస్ విజేతగా
సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. బిగ్‌బాస్ సీజన్-9 సందర్భంగా నిర్వహించిన అగ్నిపరీక్ష గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ నుంచి మొదలైన ప్రయాణం.. చివరకు విజేతగా నిలిచే స్థాయికి తీసుకొచ్చింది.
Details
ఆటతీరులో మార్పే విజయానికి కారణం
తొలినాళ్లలో కల్యాణ్ ఆటతీరు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత కల్యాణ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. తనదైన శైలిలో ఆడుతూ క్రమంగా బలమైన కంటెస్టెంట్‌గా ఎదిగాడు. తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనా, చివరి వరకూ నిలబడి హౌస్‌కు చివరి కెప్టెన్‌గా, అలాగే మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరికి బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా (Bigg Boss 9 Telugu Winner) ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కైవసం చేసుకున్నారు. షో స్పాన్సర్స్‌లో ఒకరైన 'రాఫ్ గ్రిప్పింగ్' తరఫున కల్యాణ్‌కు మరో రూ.5 లక్షల క్యాష్ ప్రైజ్ అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్ కారు కూడా ఆయన సొంతమైంది.