
కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం
ఈ వార్తాకథనం ఏంటి
కళ్యాణ్ రామ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో డెవిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా దర్శకుడిని తప్పించారంటూ వార్తలు వచ్చాయి. డెవిల్ సినిమా ప్రమోషన్ పోస్టర్లలో దర్శకుడు నవీన్ మేడారం పేరుకు బదులుగా నిర్మాత అభిషేక్ నామా పేరు ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయి విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.
తాజాగా ఈ విషయమై దర్శకుడు నవీన్ మేడారం తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సంస్కృత కొటేషన్ ని షేర్ చేశాడు.
Details
దర్శకుడిని తప్పించడంపై బయటకు రాని కారణం
డెవిల్ సినిమా యూనిట్ ఎవ్వరినీ ట్యాగ్ చేయకుండా కేవలం కొటేషన్ మాత్రమే పెట్టాడు. ప్రస్తుతం నవీన్ మేడారం ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
ఇప్పటివరకు దర్శకుడు నవీన్ మేడారంను డెవిల్ సినిమా నుండి ఎందుకు తప్పించారనే విషయమై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
నిర్మాతతో విభేదాల కారణంగా నవీన్ మేడారం బయటకు వచ్చాడని అన్నారే తప్ప అసలేం జరిగిందనేది ఎవరికీ తెలియదు. సినిమా విడుదల దగ్గర పడే సమయంలో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉందని అంటున్నారు.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న డెవిల్ సినిమా, నవంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నవీన్ మేడారం ట్వీట్
विनाश काले विपरीत बुद्धि 🌑
— Naveen Medaram (@NaveenMedaram) September 14, 2023