LOADING...
Kalyani Priyadarshan: ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ 'కొత్త లోక' చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ విడుదల

Kalyani Priyadarshan: ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ 'కొత్త లోక' చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'కొత్త లోక'కు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తొలి ఎపిసోడ్ 'కొత్త లోక చాప్టర్ 1: చంద్ర' అనేది ఈ ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే చిత్ర బృందం మలయాళ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రేక్షకులను ఆసక్తికి గురి చేశారు. నిన్నే తాజాగా తెలుగు ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ట్రైలర్‌లో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగిన యువతి 'లోక' పాత్రలో కనిపించారు.

వివరాలు 

'కొత్త లోక' తెలుగులోనూ అదే స్థాయిలో సూపర్‌హిట్ అవుతుందా? 

ఓ కొత్త ఊరికి వెళ్లిన ఆమె ఎందుకు తన పద్ధతిని మార్చుకుంది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏవీ? వంటి ప్రశ్నల చుట్టూ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న అంశాలుగా విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల రహస్యతను చెప్పుకోవచ్చు. ఫాంటసీ కథలను ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఇక మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన 'కొత్త లోక' తెలుగు ప్రేక్షకులకూ అదే స్థాయిలో ఆకర్షణీయంగా, సూపర్‌హిట్‌గా మారుతుందా? అని చూడాల్సిన అంశంగా ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్