Page Loader
Kamal Haasan birthday: అంతర్జాతీయ స్థాయిలో కమల్ హాసన్ అందుకున్న విజయాలు, పురస్కాలు ఇవే 
Kamal Haasan birthday: అంతర్జాతీయ స్థాయిలో కమల్ హాసన్ అందుకున్న విజయాలు, పురస్కాలు ఇవే

Kamal Haasan birthday: అంతర్జాతీయ స్థాయిలో కమల్ హాసన్ అందుకున్న విజయాలు, పురస్కాలు ఇవే 

వ్రాసిన వారు Stalin
Nov 07, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

కమల్ హాసన్.. భారతీయ సినీ పరిశ్రమ వరం. తమిళంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించినా, ఇంతింతై వటుడింతై అన్నట్లు తన నట ప్రభంజనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజండరీ యాక్టర్ కహల్ హాసల్ పుట్టిన రోజు నేడు. నాలుగు సార్లు జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్న కమస్.. సినీ రంగంలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, గాయకుడిగా, గీత రచయిత అన్ని విభాగాల్లోనూ తనదైన పాత్రను పోషించారు. కమల్ హసన్ తన కెరీర్‌లో.. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. నవంబర్ 2016లో జరిగిన లాస్ ఏంజిల్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ విలన్ చిత్రానికి గాను హాసన్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

కమల్

అంతర్జాతీయ స్థాయిలో మైలు రాళ్లు ఇవే

2004లో విడుదలైన 'విరుమాండి' అనే యాక్షన్-డ్రామా మూవీ బుచియోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్(దక్షిణ కొరియా)లో యూరోపియన్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫెడరేషన్ ఆసియా అవార్డును గెలుచుకుంది. భారతీయ సినిమా పరిశ్రమలో మైలురాయిగా చెప్పుకునే 'హే రామ్' మూవీ 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది భారతీయ 2000వ సినిమా. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, హేమా మాలిని, రాణి ముఖర్జీ, గిరీష్ కర్నాడ్, ఓం పూరి నటించారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ -2016లో సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గాను సన్ మార్క్ లిమిటెడ్ 'LIFF ఐకాన్' అవార్డుతో సత్కరించారు. 2013లో న్యూయార్క్ ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ & టీవీ అవార్డ్స్‌లో పురస్కారం అందుకున్నారు.