ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతీ సినిమా మీద అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ కె సినిమా మీద సగటు సినిమా అభిమానికి కూడా అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ట్రైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని వార్తలు రావడమే దానికి కారణం.
ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో విలన్ గా లోకనాయకుడు కమల్ హాసన్ నటించనున్నారని వినిపిస్తోంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ కె సినిమాకు కమల్ హాసన్ డేట్స్ ఇచ్చేసారని టాక్ నడుస్తోంది.
Details
20రోజులు షూటింగ్
ప్రాజెక్ట్ కె కోసం ఆగస్టు నెలలో 20రోజులు కమల్ హాసన్ ఇచ్చేసారని, కీలక ఎపిసోడ్లను ఆరోజుల్లో చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందని అంటున్నారు.
ప్రాజెక్ట్ కె సినిమాలో విలన్ గా నటించడానికి ఏకంగా 150కోట్ల పారితోషికం కమల్ హాసన్ అడిగారని అంటున్నారు. ప్రస్తుతానికి కమల్ హాసన్ విషయమై అధికారిక సమాచారం ప్రాజెక్ట్ కె నుండి బయటకు రాలేదు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా, 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే కనిపిస్తోంది.
అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, దిశా పటాని ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.