Page Loader
Thug Life: కమల్ హాసన్- మణిరత్నం మూవీకి 'థగ్ లైఫ్' టైటిల్ ఖారారు
Thug Life: కమల్ హాసన్- మణిరత్నం మూవీకి 'థగ్ లైఫ్' టైటిల్ ఖారారు

Thug Life: కమల్ హాసన్- మణిరత్నం మూవీకి 'థగ్ లైఫ్' టైటిల్ ఖారారు

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్ నాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న 'KH234' మూవీకి టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సినిమాకు థగ్ లైఫ్(Thug Life) పేరును ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర బృందం టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది. కమల్ పుట్టిన రోజు మంగళవారం కాగా, ఒక రోజు ముందుగానే చిత్ర యూనిట్ ఆయన అభిమానులకు టైటిల్ ప్రకటించి, బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. హాసన్, మణిరత్నం 35ఏళ్ల నాయకన్ సినిమా కోసం పనిచేశారు. వీరు ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం కావడంపై ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కమల్ నటిస్తున్న 234వ చిత్రం.

కమల్ హాసన్

'థగ్ లైఫ్' సినిమాలో దుల్కర్ సల్మాన్, త్రిష 

ఈ మూవీకి సంబంధించి చిత్ర బృందం మరో కీలక అప్టేట్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, నటి త్రిష కృష్ణన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వీరికి సంబంధించిన పోస్టర్‌ను నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుధా కొంగర దర్శకత్వం వహించనున్న సూర్య 43వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ బాస్కర్‌లో అతను తదుపరి చిత్రంలో దుల్కర్ కనిపించబోతున్నాడు. ఇక త్రిష విషయానికి వస్తే, ఆమె అజిత్‌తో కలిసి విదాముయార్చిలో నటిస్తోంది. త్రిష తన తాజా చిత్రం 'లియో' భారీ విజయాన్ని అందుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టైటిల్‌ను ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ ట్వీట్