Page Loader
Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్ 
రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్నదర్శన్

Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన విషయాన్ని అంగీకరించారు. ఈ వివరాలను ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. "నేను అక్కడికి చేరినప్పటికి రేణుకాస్వామి ఎంతో అలసిపోయి కనిపించాడు.అప్పటికే అతడిపై దాడి జరిగినట్లు అనిపించింది. నేను అతడి మెడ, ఛాతి, తల భాగాలను తన్నాను. నా చేతులతో పాటు చెట్టుకొమ్మతో కూడా కొట్టాను. చెప్పుతో కొట్టమని పవిత్ర గౌడకు కూడా చెప్పాను," అని దర్శన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో పవిత్ర గౌడ ప్రధాన నిందితురాలని పోలీసులు వెల్లడించారు. ఆమె ఇతర నిందితులను రెచ్చగొట్టి, వారితో కలిసి కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

వైరల్‌గా మరీనా  రేణుకాస్వామిపై దాడి ఫోటోలు 

ఇక, ఈ కేసులో ఇటీవల కొన్ని కీలక ఫొటోలు వైరల్‌గా మారాయి. రేణుకాస్వామిపై దాడి జరిగిన సమయంలో తీసిన ఫొటోలు ఇవని తెలుస్తోంది. దర్శన్‌, అతడి అనుచరులు అతడిని ఓ లారీ ఎదుట కూర్చోబెట్టి తీవ్రంగా దాడి చేసినట్లు ఫొటోలు సూచిస్తున్నాయి. ఫొటోలలో రేణుకాస్వామి చొక్కా లేకుండా ఏడుస్తూ కనిపిస్తుండగా, మరొక ఫోటోలో అతడు పడిపోయి ఉండగా అతడి చేతిపై తీవ్ర గాయం కనిపిస్తోంది. ఈ ఫొటోలు కొన్ని పత్రికల చేతిలోకి చేరి, ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. రేణుకాస్వామిని కరెంట్ షాకులు ఇచ్చి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడింది. హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు, బూట్లు, డబ్బు లాంటి వస్తువులను అధికారులు రికవరీ చేసినట్లు కూడా వివరించారు.