Kannappa : 'కన్నప్ప' మేకింగ్ వీడియో విడుదల.. విష్ణు ఎమోషనల్ రియాక్షన్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా నటిస్తున్నారు.
ఇక మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక విడుదల తేదీ సమీపిస్తున్న కారణంగా 'కన్నప్ప' టీమ్ ప్రమోషన్లకు ఊపందించింది.
Details
అంచనాలను పెంచుతున్న విజువల్స్
ఇప్పటికే విడుదలైన 'శివా శివా శంకర' పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి.
తాజాగా విష్ణు మంచు 'కన్నప్ప' మేకింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ సినిమాకోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని చర్చలు జరిపామో, ఎంత హార్డ్ వర్క్ చేశామో ఈ వీడియో ద్వారా విష్ణు వివరించారు.
ఈ వీడియో చూస్తుంటే సినిమా కోసం ఎంత కష్టపడ్డారో స్పష్టంగా అర్థం అవుతోంది.
ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'కన్నప్ప' సినిమా మీద ఉన్న హైప్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం మరింత ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.