LOADING...
Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా!
భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా!

Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రమోషన్లకు స్పీడు పెరిగింది. సినిమా మీద ఆసక్తి పెంచేందుకు హీరో మంచు విష్ణుతో పాటు ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో జూన్ 27న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 22న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ వేడుకకు ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ 'రుద్ర' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Details

ట్రైలర్ ఇండోర్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు

ఇదివరకెప్పుడూ కనిపించని విధంగా ప్రభాస్ ఈ పాత్రలో శివ తత్వాన్ని ఆకళింపు చేసేందుకు ప్రయత్నించారట. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్‌లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్‌లాల్ లుక్ ఇటీవలే విడుదల కాగా, ట్రైలర్‌ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనికి అక్షయ్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కథలో కన్నప్ప అనే గొప్ప భక్తుడి జీవితం ఆద్యంతం చూపించనున్నారు. దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి ఎలా శివునికి ఆరాధకుడయ్యాడన్న విషయాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించనున్న ఈ చిత్రం పౌరాణికతతో పాటు విజువల్‌ రిచ్‌గా ఉండనుందని తెలుస్తోంది.