Page Loader
Kannappa : రెండో రోజూ దూసుకెళ్లిన కన్నప్ప.. రూ.7 కోట్లు దాటిన కలెక్షన్లు!
రెండో రోజూ దూసుకెళ్లిన కన్నప్ప.. రూ.7 కోట్లు దాటిన కలెక్షన్లు!

Kannappa : రెండో రోజూ దూసుకెళ్లిన కన్నప్ప.. రూ.7 కోట్లు దాటిన కలెక్షన్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు నటించి, నిర్మించిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి రోజునుంచి మంచి టాక్‌తో దూసుకెళుతోంది. ముఖ్యంగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్‌ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వారికున్న ఫ్యాన్‌బేస్ కూడా సినిమా విజయాన్ని మరింత బలపరిచింది. విడుదలైన మొదటి రోజునే రూ. 9.35 కోట్లు నెట్ వసూళ్లు సాధించిన కన్నప్ప, రెండు రోజుల్లో మొత్తం రూ. 16.35 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. వీటిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచే భారీ ఆదాయం లభించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండో రోజున కూడా రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు జరగడం విశేషం.

Details

 ప్రభాస్ హైప్.. కలెక్షన్లకు బూస్ట్

ఈ సందర్భంగా మంచు విష్ణు స్పందిస్తూ థియేటర్లకు ప్రజలు ప్రభాస్‌ను చూసేందుకే ఎక్కువగా వస్తున్నారు. ఆయన క్రేజ్ సినిమాకు ఊపునిచ్చిందని అన్నారు. ప్రేక్షకుల నుంచి సినిమాకు చివరి 60 నిమిషాలపై ప్రత్యేకంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు విజువల్స్ పరంగా కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయని అంటున్నారు. సినిమా విడుదలైన రెండో రోజునే కన్నప్ప టీం ప్రత్యేకంగా థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ప్రేక్షకుల మద్దతుతో ఈ విజయాన్ని సాధించామని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు ప్రకటించారు. ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే 'కన్నప్ప' పాజిటివ్ మౌత్ టాక్‌తో వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మంచు విష్ణు కెరీర్‌లో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.