Page Loader
Shefali Jariwala: 'కాంటా లగా' ఫేమ్ షఫాలీ మృతి.. ఖాళీ కడుపుతో ఇంజెక్షన్‌ కారణమా?
'కాంటా లగా' ఫేమ్ షఫాలీ మృతి.. ఖాళీ కడుపుతో ఇంజెక్షన్‌ కారణమా?

Shefali Jariwala: 'కాంటా లగా' ఫేమ్ షఫాలీ మృతి.. ఖాళీ కడుపుతో ఇంజెక్షన్‌ కారణమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ నటి, 'కాంటా లగా' రీమిక్స్ సాంగ్‌తో సూపర్‌హిట్‌ సాధించిన షఫాలీ జరివాలా(42) అకాల మరణం బాలీవుడ్‌ను, ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శుక్రవారం ఆమె అకస్మాత్తుగా హృదయ ఆపాతతో (కార్డియాక్ అరెస్ట్) మరణించినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ ముంబయి పోలీసులు ఇప్పటికీ పూర్తి వివరాలను వెల్లడించలేదు. దీంతో ఆమె మృతికి సంబంధించి పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో షఫాలీ ఇటీవల యాంటీ ఏజింగ్‌ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆమె ఉపవాసంగా ఉండిపోయిందని, ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్‌కు సంబంధించిన ఔషధాలు, ఇంజెక్షన్లు తీసుకోవడం వల్లే హృదయ ఆపాతం కలిగి ఉండవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి.

Details

కచ్చితమైన కారణాన్ని చెప్పని కుటుంబ సభ్యులు

ఆమె శరీరంలో అస్వస్థత లక్షణాలు కనిపించడంతో భర్త పరాగ్‌ త్యాగీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11.15 గంటలకు షఫాలీని తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు తేలిందని వారు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు మాత్రం ఆమె మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. 2002లో విడుదలైన 'కాంటా లగా' రీమిక్స్ పాటతో షఫాలీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Details

ఆమె మరణంపై పలువురు సినీ ప్రముఖుల సంతాపం

ఆ పాటతో ఆమె 'కాంటా లగా గర్ల్‌'గా పేరుగాంచారు. అనంతరం సల్మాన్ ఖాన్‌ నటించిన 'ముజ్సే షాదీ కరోగీ', కన్నడ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌తో 'హుడుగారు' చిత్రాల్లో నటించే అవకాశాలొచ్చాయి. అలాగే టీవీ రంగంలో కూడా ఆమె రియాలిటీ షోల్లో భాగమై మెరిశారు. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13లోనూ ఆమె పోటీదారుగా పాల్గొన్నారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్‌తో ఆమె వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారి సంబంధం ముగిసింది. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని షఫాలీ వివాహమాడారు. ఒక చురుకైన కళాకారిణి ఈ విధంగా అకాల మరణం చెందడంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.