
Kantara 2: కాంతార2 టీమ్‌లో విషాదం.. గుండెపోటుతో మరొక జూనియర్ ఆర్టిస్ట్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి నటించిన "కాంతార" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు "కాంతార 2" రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ ప్రీక్వెల్ చిత్రానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి తారసపడుతున్న విషాద ఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
తొలుత చిత్రబృందం ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత, కాంతార: చాప్టర్ 1 లో పని చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ మరణించడం కలకలం రేపింది.
ఇప్పుడు మరో విషాద వార్త అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాలు
రాకేశ్ పూజారి గుండెపోటుతో మృతి
కాంతార 2లో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్ పూజారి (34) గుండెపోటుతో మృతి చెందారు.
కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ కూడా దురదృష్టవశాత్తూ మృతి చెందాడు.
అతను తన స్నేహితులతో కలిసి ఉడిపి జిల్లా కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు.
అయితే, నీటి లోతు అంచనా లేకుండానే నదిలోకి దిగడంతో అతనికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
మొదట్లో అతను 'కాంతార: చాప్టర్ 1' షూటింగ్ సమయంలో మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ, నిర్మాణ సంస్థ ఈ వార్తలను ఖండించింది.
తాజాగా, "కాంతార 2"లో ముఖ్యమైన పాత్రలో నటించిన రాకేశ్ పూజారి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
వివరాలు
రాకేశ్ 'కామెడీ ఖిలాడిగళు' అనే షోలో మూడో సీజన్ విజేత
రాకేశ్ 'కామెడీ ఖిలాడిగళు' అనే షోలో మూడో సీజన్ విజేతగా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన కన్నడ, తుళు భాషల్లో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
కాంతార 2 చిత్రంలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కొద్దికాలం క్రితమే పూర్తి చేసినట్లు సమాచారం.
రాకేశ్ తన స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మెహందీ ఫంక్షన్‌లో పాల్గొన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
అంతకుముందు రాకేశ్ తన మెహందీ వేడుకలో దిగిన ఫోటోలు షేర్ చేయగా, తరువాత సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ ఉత్సాహం, ఆనందం కాసేపటికే విషాదంలోకి మారింది.
వివరాలు
హోంబలే ఫిల్మ్స్ తరఫున సంతాపం తెలిపిన రిషబ్ శెట్టి
ఈ ఘటనపై కార్కల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.
రాకేశ్ మృతిపట్ల "కాంతార 2" చిత్ర హీరో రిషబ్ శెట్టి, చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తరఫున తీవ్ర సంతాపం తెలిపారు.
"మిత్రమా... మళ్లీ జన్మించు" అంటూ భావోద్వేగపూరితంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆయన తన పోస్ట్‌లో, "కాంతారలో నీ పాత్ర, ఆ పాత్రను పోషించే సమయంలో నీ ముఖంపై కనిపించిన చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో నిలిచి ఉంటుంది. నీ లాంటి మిత్రుడి లోటును ఎవ్వరూ తీర్చలేరు" అంటూ రాకేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిషబ్ శెట్టి చేసిన ట్వీట్
ನೀನು ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ಒಬ್ಬ ಅದ್ಭುತ ಕಲಾವಿದ. ಕಾಂತಾರ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಿನ್ನ ಪಾತ್ರ ಹಾಗು ಅದನ್ನು ನಿರ್ವಹಿಸುವಾಗ ನಿನ್ನ ಮುಖದ ನಗು ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ಶಾಶ್ವತ. ಕಲಾವಿದ ವರ್ಗಕ್ಕೆ ಇದೊಂದು ತುಂಬಲಾರದ ನಷ್ಟ .. ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬಾ ಗೆಳೆಯ ..
— Rishab Shetty (@shetty_rishab) May 12, 2025
ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ. ದೇವರು ಈ ಆಘಾತವನ್ನು ಸಹಿಸುವ… pic.twitter.com/x2Cev99kGi