
kanthara Chapter1 : దసరా కానుకగా కాంతార చాఫ్టర్ 1.. ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం శాండిల్‌వుడ్ టాప్-5 హయ్యెస్ట్ గ్రాసర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో శాండిల్‌వుడ్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని సంకల్పించాడు. 'థింక్ బిగ్' కాన్సెప్ట్‌తో కాంతార ప్రీక్వెల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. అనేక అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి షూటింగ్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసిన కాంతార: చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది.
Details
అక్టోబర్ 1న రాత్రి ప్రీమియర్స్
తెలుగు మార్కెట్లో ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా నైజాం రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీస్ కొనుగోలు చేసింది. ఇక టాలీవుడ్‌లో ఇటీవల ఎర్లీ ప్రీమియర్స్ ట్రెండ్ బలంగా నడుస్తోంది. తాజాగా విడుదలైన 'OG' సినిమాను కూడా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌తో రిలీజ్ చేశారు. అదే తరహాలో రాబోతున్న కాంతార చాప్టర్-1కు కూడా అక్టోబర్ 1న రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు అదనంగా రూ.50 టికెట్ ధర పెంచుతున్నారు. దీనికి అవసరమైన అనుమతులు త్వరలోనే రాబోతున్నాయి.