
KantaraChapter1 : కాంతార చాప్టర్ 1.. నాగ సాధువు, యోధుడి పాత్రలో రిషబ్ శెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ సినిమా చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన 'కాంతార' సినిమా యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చి రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందించారు. కన్నడ కాకుండా తెలుగు, తమిళ్, హిందీ మార్కెట్లలో కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది కాంతార. ఈ విజయం నేపథ్యంలో, హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 తీసుకువస్తోంది, దీనిపై భారీగా పెట్టుబడి పెట్టింది. చాలా వైరల్ అయిన కాంతార చాప్టర్ 1 సినాప్సిస్ ప్రకారం, ఈ సినిమా 2022 సంచలన సంఘటనలకు చాలా ముందే 300 CEలో కదంబ రాజవంశం పాలనలో జరిగే పురాతన కథను చూపిస్తుంది. కథ బనవాసిలోని ఆధ్యాత్మిక అడవులలో నడుస్తుంది.
Details
ఆక్టోబర్ 2న రిలీజ్
అక్కడ దైవిక ఆత్మలు మేల్కొంటాయి, దైవ సంప్రదాయం మూలాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయి. రిషబ్ శెట్టి భయంకర నాగ సాధువుగా రూపాంతరం చెందుతాడు. అతను మానవులూ, దైవికుల మధ్య వారధిగా మారి యోధుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ప్రతీ సీన్‌లో పురాతన ఆచారాలు, అతీంద్రియ శక్తులు, గిరిజన పోరాటాలు ఏదీ లేని విధంగా చిత్రీకరించారు. కాంతార: చాప్టర్ 1 కేవలం ప్రీక్వెల్ మాత్రమే కాక, ఒక పురాణ కథ మూలాన్ని చూపిస్తుంది. ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా రూపొందించేందుకు భారీ కృషి జరుగుతోంది. రిషబ్ శెట్టి నటన సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందిన కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా విడుదలకాబోతోంది.