LOADING...
Kantara Chapter 1: 'కాంతార చాప్టర్‌ 1' ట్రైలర్ విడుదల.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ!

Kantara Chapter 1: 'కాంతార చాప్టర్‌ 1' ట్రైలర్ విడుదల.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో రికార్డులు బ్రేక్ చేసిన 'కాంతర' సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం 'కాంతర చాప్టర్‌ 1' ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్‌ థ్రిల్లర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల సమక్షానికి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో పంజుర్లకు సంబంధించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, వీటి ద్వారా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ అనుభూతి కలిగేలా చేశారు.