LOADING...
Kantara Chapter 1 Collections: రెండు వారాలలో.. రూ.700కోట్లకు పైగా కలెక్షన్స్.. ద్వితీయ స్థానంలో 'కాంతార చాప్టర్‌ 1'
ద్వితీయ స్థానంలో 'కాంతార చాప్టర్‌ 1'

Kantara Chapter 1 Collections: రెండు వారాలలో.. రూ.700కోట్లకు పైగా కలెక్షన్స్.. ద్వితీయ స్థానంలో 'కాంతార చాప్టర్‌ 1'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కలెక్షన్ల పరంగా 'కాంతార చాప్టర్-1' కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో మైలురాయిని దాటింది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించినట్లుగా, ఈ సినిమా రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్లకు పైగా (గ్రాస్‌) వసూలు చేసింది. ఈ విషయాన్ని వారు సోషల్‌ మీడియాలో కూడా ప్రకటించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే రూ.105 కోట్లకు పైగా వసూలు అందింది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో 'కాంతార 1' ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉంది.

వివరాలు 

రిలీజ్‌ రోజే రూ.89 కోట్లు 

తొలి స్థానంలో 'కేజీయఫ్‌ 2' ఉంది, దీని కలెక్షన్లు రూ.1200 కోట్లకు మించాయి. 'కాంతార చాప్టర్‌ 1' ఈ నెల 2న విడుదలయింది. రిలీజ్‌ రోజే అత్యధిక వసూలు రూ.89 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇది కన్నడ సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా నిలిచింది. 24 గంటల్లో 'బుక్‌మై షో' ద్వారా 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయాయి. ఈ పోర్టల్‌ వేదికగా ఈ ఏడాదిలో ఈ రేంజ్‌లో టికెట్లు సేల్‌ కావడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్