NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
    తదుపరి వార్తా కథనం
    రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
    కాంతారా 2 పనులు మొదలెట్టిన రిషబ్ శెట్టి

    రైటింగ్ నుండే మొదలైన కాంతారా 2 ప్రమోషన్, సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 23, 2023
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంతారా.. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే సునామీ అనవచ్చేమో!

    కేజీఎఫ్ తర్వాత అంతటి ప్రభావాన్ని చూపించిన కన్నడ చిత్రం ఇదే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కాంతారా సినిమాను పాన్ ఇండియాగా తీర్చిదిద్దింది ప్రేక్షకులే.

    నిజానికి చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్లు జరగలేదు. సినిమా బాగుంది, మంచి అనుభవాన్ని పొందవచ్చన్న టాక్ రావడంతో మిగతా భాషల వాళ్ళు సైతం సినిమా నెత్తిన పెట్టేసుకున్నారు.

    ఫలితంగా బ్లాక్ బస్టర్ వసూళ్ళు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కబోతుంది. ఆల్రెడీ పనులు మొదలయ్యాయని అప్డేట్ వచ్చింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాంతారా 2 పనులు మొదలెట్టిన రిషబ్ శెట్టి

    ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಷಯಗಳು.
    Happy Ugadi !

    ಬರವಣಿಗೆಯ ಆದಿ…Kantara writing begins ! pic.twitter.com/6nfIfCeEiu

    — Rishab Shetty (@shetty_rishab) March 22, 2023

    కాంతారా

    జూన్ లో మొదలయ్యే కాంతారా 2 షూటింగ్

    కాంతారా సినిమా ఎక్కడ మొదలైందో, అక్కడి నుండి వెనక వైపు ఏం జరిగిందో చూపించడానికి రిషబ్ శెట్టి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ రైటింగ్ పనులు స్టార్ట్ అయ్యాయని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు.

    దీంతో కాంతారా గురించి ఆశగా చూస్తున్న అందరిలోనూ ఉత్సాహం కలిగింది. ఇప్పటి నుండి మొదలైన రైటింగ్ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందట. ఆ తర్వాత జూన్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    సాధారణంగా పూజా ముహూర్తంతో ప్రమోషన్ పనులు, సినిమా పనులు మొదలవుతాయి. కానీ కాంతారా మీద జనాల ఆసక్తిని మరింత పెంచడానికి రైటింగ్ టైమ్ నుండే అప్డేట్స్ ఇస్తున్నాడు రిషబ్ శెట్టి.

    మరి రిషబ్ శెట్టి కాంతారా ముందు ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ
    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత తెలుగు సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025