Page Loader
Kantara prequel : 'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!
'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

Kantara prequel : 'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న సినిమాగా ప్రారంభమై సంచలన విజయం సాధించిన చిత్రం 'కాంతార'. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కన్నడలో మొదటిసారిగా విడుదలై అద్భుతమైన స్పందన పొందింది. ఆ తరువాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలై రూ.400 కోట్ల క్లబ్‌లో చేరి బిగెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ క్రియేటివ్ ఫిల్మ్‌ మేకర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' శరవేగంగా తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలకు సంబంధించి కొన్ని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

Details

ఆక్టోబర్ 2న రిలీజ్

గతంలో ప్రకటించిన ప్రకారం, ఈ చిత్రం 2024 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడింది. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ షూటింగ్ యథావిధిగా కొనసాగుతోందని, ముందుగా ప్రకటించిన ప్రకారమే అక్టోబర్ 2, 2025న విడుదల కానుందని స్పష్టం చేసింది.

Details

భారీ యాక్షన్ సీన్ హైలైట్! 

'కాంతార' అంచనాలకు మించి విజయం సాధించడంతో, ప్రీక్వెల్‌ను మరింత గ్రాండ్ స్కేల్‌లో, అధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సీన్ సినిమాకే హైలైట్ కానుందని, ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని కలిగించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.