Kantara: Chapter 1: భారతదేశంలో తొలి మూవీగా కాంతార రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియా మూవీ 'కాంతార: చాప్టర్ 1' ప్రేక్షకులను మెప్పించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించగా, విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే ఈ చిత్రం, తెలుగులో 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Details
'కాంతార: చాప్టర్ 1' మరో అరుదైన రికార్డు
విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా 'కాంతార: చాప్టర్ 1' మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టిస్తోంది. ఈ ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ వెర్షన్ కోసం చిత్ర బృందం రన్‌టైమ్‌ను తగ్గించింది. ఈ వెర్షన్ 2 గంటలు 45 నిమిషాలు 40 సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా హిట్ 'కాంతార: చాప్టర్ 1', ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్‌లో తన విజయ రన్నును కొనసాగిస్తూ సంచలనాన్ని సృష్టిస్తోంది.