తదుపరి వార్తా కథనం
Karthi Hospitalised : 'సర్దార్ 2' షూటింగ్‌లో కార్తీకి గాయం.. చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేత!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 04, 2025
05:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో కార్తీ 'సర్దార్ 2' సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. మైసూరులో కీలక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి గాయమైంది.
ఈ ప్రమాదం వెంటనే చిత్ర యూనిట్ స్పందించి, కార్తీని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు కార్తీకి వారం రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. పూర్తిగా కోలుకోవడానికి ఈ సమయం పడుతుందని తెలిపారు. దీంతో 'సర్దార్ 2' మూవీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
కార్తీ పూర్తిగా కోలుకున్న తర్వాతే చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు.
'సర్దార్ 2' సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో రజిశా విజయన్, ఎస్.జే.సూర్య, మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.