Page Loader
KARTHI 29 : మరో మాస్ మూవీతో కార్తీ 29వ చిత్రం ప్రారంభం.. టైటిల్ పోస్టర్ విడుదల!
మరో మాస్ మూవీతో కార్తీ 29వ చిత్రం ప్రారంభం.. టైటిల్ పోస్టర్ విడుదల!

KARTHI 29 : మరో మాస్ మూవీతో కార్తీ 29వ చిత్రం ప్రారంభం.. టైటిల్ పోస్టర్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ హీరో కార్తీ ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో పూర్తిగా బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్న కార్తీ, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ విశేష ఆదరణ పొందుతున్నాడు. ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్* వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం కార్తీ రెండు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నాడు. ఒకటి సర్దార్ సినిమా సీక్వెల్‌గా రూపొందుతున్న సర్దార్ 2, మరొకటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఖైదీ చిత్రం సీక్వెల్ ఖైదీ 2. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Details

'మార్షల్' అనే టైటిల్ ఖరారు

ఇదిలా ఉండగా, తాజాగా కార్తీ తన 29వ సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ కొత్త చిత్రానికి 'మార్షల్' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన 'తనక్కారన్' చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు తమిళ్ ఈ సినిమాకు మెగాఫోన్ పట్టాడు. సంగీతం కోసం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి ఆభ్యంకర్‌ను ఎంచుకున్నారు. ఈచిత్రం కథ రామేశ్వరం నేపథ్యంతో సాగనుంది. అందువల్ల ఎక్కువ భాగం సముద్రతీర ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది. ఈచిత్రాన్ని రెండు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాష్ బాబు, ఎస్ఆర్. ప్రభు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.