టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్
హీరో కార్తీ, డబుల్ రోల్లో మెప్పించిన యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్.. ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. కార్తీ ద్విపాత్రాభినయంతో తమిళ మాతృకగా రూపొందిన సర్దార్, తెలుగులోనూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన సర్దార్, నీటి ప్రాధాన్యం తెలిపే అంశంతో ముడిపడిన కథ. నీటి నిర్వహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు, సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా, ఆలోచింపజేసేలా ఉంటుంది.
డ్యుయల్ రోల్ లో మెప్పించిన కార్తీ
పైప్లైన్ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహిగా అజ్ఞాతంలో జీవిస్తున్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడనేదే సర్దార్ కథ. యువకుడిగా, మధ్య వయస్కుడిగా డ్యుయల్ రోల్లో కార్తి నటనతోపాటు, రాశీ ఖన్నా, రజీశా విజయన్, చంకీ పాండే, లైలా నటించిన కీలక పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, కార్తీ నుండి పొన్నియన్ సెల్వన్2 మూవీ వస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీణ విడుదల అవుతుంది.