
గేమ్ ఛేంజర్ సినిమాకు దర్శకుడిగా ఎందుకు మారలేదో వెల్లడి చేసిన కార్తీక్ సుబ్బరాజు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా వెల్లడి చేశారు.
శంకర్ రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. తాను కూడా దర్శకుడు అయినప్పటికీ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు కథను అందించారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమాను తానే ఎందుకు డైరెక్ట్ చేయలేకపోయారని చాలామంది ప్రశ్నించారు. తాజాగా ఈ ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజు సమాధానం ఇచ్చారు.
Details
శంకర్ మాత్రమే న్యాయం చేయగలరు
తన వద్ద ఏవైనా కథలు ఉన్నాయా అని దర్శకుడు శంకర్ తనను అడిగారని కార్తీక్ సుబ్బరాజు చెప్పుకొచ్చారు.
భారతదేశంలో చెప్పుకోదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ కథను అడగడంతో ఆయనకు గేమ్ ఛేంజర్ కథను వినిపించానని, ఆ కథ బాగా నచ్చడంతో ఆయన తీసుకున్నారని అన్నారు.
గేమ్ ఛేంజర్ కథ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కథను తెర మీదకి తీసుకురావడంలో శంకర్ సార్ మాత్రమే న్యాయం చేయగలరని కార్తీక్ సుబ్బరాజ్ తెలియజేశారు.
కమర్షియల్ సినిమాలో సామాజిక అంశాలను మిళీతం చేసి సినిమాను విజయవంతం చేయడంలో శంకర్ చాలా సార్లు సక్సెస్ అయ్యారు.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.