ట్రైలర్ టాక్: యుగాంతం కథలను గుర్తు చేస్తున్న బెదురులంక 2012 ట్రైలర్
కార్తికేయ, డీజే టిల్లు భామ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బెదురులంక 2012. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 2012సంవత్సరంలో యుగాంతం జరుగుతుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. మయన్ క్యాలెండర్ ఐపోయిందని, ప్రళయం ముంచుకొచ్చి యుగాంతం అంతమవుతుందని అన్నారు. ఐతే ఆ సమయంలో ఏమీ జరగలేదు. కానీ కొన్ని ఊర్లలో యుగాంతం భయాలు మనుషుల్లో రకరకాలుగా కనిపించాయి. ఆ భయాలను, మనుషుల్లోని వింత ప్రవర్తనను బెదురులంక 2012 చూపించనుందని ట్రైలర్ లో అర్థమవుతోంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యుగాంతం పేరుతో భయాలు, ఇంకా అల్లర్లు, అనేక మూఢనమ్మకాలను ఇందులో చూపించారు. అలాగే కార్తికేయ, నేహాశెట్టి మధ్య మాంచి లవ్ ట్రాక్ ఉన్నట్టుగా ట్రైలర్ లో కనిపిస్తోంది.
ఆగస్టు 25న విడుదల
యుగాంతం మాటలు ప్రచారంలో ఉన్న సమయంలో బెదురులంక గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? వాటికి మనుషులు ఎలా స్పందించారో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి తదితరులు నటించారు. లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల సహనిర్మాతలుగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా, ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతుంది.