Page Loader
Sardar 2: కార్తి 'సర్దార్‌ 2' సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో ఎస్‌జే సూర్య.. విడుదలైన 'ప్రోలాగ్‌' వీడియో 

Sardar 2: కార్తి 'సర్దార్‌ 2' సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో ఎస్‌జే సూర్య.. విడుదలైన 'ప్రోలాగ్‌' వీడియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా విడుదలైన సినిమా 'సర్దార్‌'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, పీఎస్ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్‌లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'సర్దార్‌ 2' అనే సీక్వెల్ రూపొందుతోంది. తాజాగా, చిత్రబృందం ఇందులో ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తూ ప్రోలాగ్‌ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

వివరాలు 

బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్

సుమారు 2 నిమిషాల 57 సెకండ్ల నిడివి గల 'సర్దార్‌ 2' ప్రోలాగ్‌ వీడియో యాక్షన్ సీన్‌తో ప్రారంభమైంది. 'ఇది నాతో సర్దార్‌.. నీ దేశానికి ఓ భారీ ప్రమాదం దగ్గర్లో ఉంది. బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్' అంటూ ఎస్‌జే సూర్యను పరిచయం చేశారు. ఈ ప్రోలాగ్‌ వీడియో ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. 'సర్దార్‌ 2'లో కార్తీ సరసన మాళవిక మోహనన్‌, ఆషిక రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక 'సర్దార్‌' చిత్రంలో రాశీ ఖన్నా, రాజీషా విజయన్‌ నటించిన విషయం తెలిసిందే.