వెబ్ సిరీస్ గా కాశ్మీర్ ఫైల్స్: కాశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2022లో హిందీలో రిలీజైన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి 250కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయి.
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాను వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసారు. అయితే ప్రస్తుతం కాశ్మీర్ ఫైల్స్ సినిమా సంబంధిత విషయాల మీద వెబ్ సిరీస్ రానుంది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసిన దర్శకుడు వివేక్, కాశ్మీర్ ఫైల్స్ మారణహోమాన్ని తిరస్కరించిన వారు, తీవ్రవాద మద్దతుదారులు, ఇండియా శత్రువులు కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రశ్నించారు.
కాశ్మీర్ మారణహోమానికి సంబంధించిన ఘోరమైన నిజాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నామని దర్శకుడు వివేక్ చెప్పుకొచ్చారు.
Details
కాశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో సిరీస్
కాశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం చేసిన ఇంటర్వ్యూలు, రీసెర్చ్ ఉండనుంది. ఏడు భాగాలుగా ఉండనున్న ఈ సిరీస్, జులై చివర్లో జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, ఆ సినిమా మీద అన్ని విమర్శలు వచ్చాయి.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను జీ స్టూడియోస్, ఐయామ్ బుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లలో తేజ్ నారయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి నిర్మించారు.