LOADING...
Katrina Kaif : బేబీ బంప్ ఫోటోతో కత్రినా కైఫ్.. అభిమానుల్లో సంబరాలు
బేబీ బంప్ ఫోటోతో కత్రినా కైఫ్.. అభిమానుల్లో సంబరాలు

Katrina Kaif : బేబీ బంప్ ఫోటోతో కత్రినా కైఫ్.. అభిమానుల్లో సంబరాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పటి బాలీవుడ్ టాప్‌ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా మారబోతున్నారు. 2021లో నటుడు విక్కీ కౌశల్‌తో ప్రేమించి వివాహం చేసుకున్న కత్రినా, పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు దూరమయ్యారు. ఈ మధ్య నుంచి కత్రినా గర్భవతి అని గాసిప్స్‌ వస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో ఆమె బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో ఆ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో కత్రినా-విక్కీ జంట స్వయంగా అధికారికంగా శుభవార్తను పంచుకున్నారు.

Details

కొత్త అధ్యాయం మొదలవుతుంది

విక్కీ కౌశల్, కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మా జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు. ఈ ఆనంద వార్త వెలుగులోకి రాగానే బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.