Keeda Cola Aha : ఆహాలోకి వచ్చేస్తున్న 'కీడా కోలా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
కీడా కోలా సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాణ బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే టాకీసుల్లో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ తాజాగా ఓటిటిలోనూ అలరించనుంది. డిసెంబర్ 29న 'ఆహా'లో 'కీడా కోలా'ను విడుదల చేయనున్నట్లు ఓటిటి ఫ్లాట్ ఫారమ్ తెలిపింది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో యూత్ ఫుల్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ ముందుంటారు. ఈ మేరకు 'పెళ్లి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత నవంబర్ 3న కీడా కోలా సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. కామెడీ, థ్రిల్లర్'గా రూపొందించిన కీడా కోలా ప్రేక్షకులను అలరించింది. తొలి షో నుంచే మంచి టాక్'ను సొంతం చేసుకుంది.