
keerthy suresh: 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు జగపతి బాబుకి కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకుంది. ఇప్పటివరకు ఈ షోకు పలువురు సినీ తారలు వచ్చి, ఎన్నో రహస్య విషయాలను పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, కీర్తి సురేశ్ తన పెళ్లికి సంబంధించిన విశేషాలు షోలో వెల్లడించారు. కీర్తి సురేశ్ మాట్లాడుతూ తన పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానందుకు క్షమాపణలు తెలిపారు. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తన ప్రేమ వివరాలు తెలుసు అని, జగపతి బాబు కూడా వారిలో ఒకరు అని చెప్పారు.
Details
పెళ్లికి పిలవలేకపోయాను
పెళ్లి అయ్యేవరకూ నా ప్రేమ విషయాలు చాలా తక్కువమందికి చెప్పాను. నేను మిమ్మల్ని నమ్మి మీతో పంచుకున్నాను. కా నీ పెళ్లి సమయంలో పిలవలేకపోయాను. క్షమించండి అంటూ పేర్కొంది. కీర్తి తన ఆంథోనీ తటిల్ గురించి చెప్పుతూ, ప్రేమను కుటుంబ అంగీకారం తర్వాత మాత్రమే పెళ్లికి తీసుకురావాలని భావించారని తెలిపారు. 15 సంవత్సరాలు ప్రేమలో ఉన్నట్లు, ఆరేళ్లు ఆమె భర్త ఖతార్‌లో, ఆమె ఇండియాలో ఉన్నారని వివరించారు. అక్కడినుంచి ఇంట్లో చెప్పాలని అనుకున్నారు. చివరగా, నాలుగు సంవత్సరాల క్రితం ఇంట్లో చెప్పిన తర్వాతే వారి పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.