Loading...
Keerthy Suresh: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్‌ క్లారిటీ ...ఎప్పటికీ అలా చేయను
రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్‌ క్లారిటీ ...ఎప్పటికీ అలా చేయను

Keerthy Suresh: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్‌ క్లారిటీ ...ఎప్పటికీ అలా చేయను

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదంపై నటి కీర్తి సురేష్‌ తాజాగా స్పందించారు. దక్షిణాది సినిమాల్లో మేనరికం వివాహాలు, హీరోయిన్ల పాత్రలపై రాధికా మాట్లాడిన సమయంలో పక్కనే ఉన్న కీర్తి నవ్వడంతో ఆమె కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించారనే ప్రచారం జరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో కీర్తిపై విమర్శలు వచ్చాయి. అయితే తన ఉద్దేశం అది కాదని కీర్తి స్పష్టం చేశారు. రాధికా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ విషయాన్ని ఉద్దేశించి చెప్పారో తనకు వెంటనే అర్థం కాలేదని, తర్వాత దక్షిణాదిలోని కొన్ని సంప్రదాయాల గురించే ఆమె మాట్లాడుతున్నారని తెలుసుకున్నానని వివరించారు.

Details

దక్షిణాది సంప్రదాయాలపై ఏమన్నారంటే?

తాజా చిత్రం 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై కీర్తికి ప్రశ్న ఎదురైంది. దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆమె స్పష్టం చేశారు.

ఉత్తరాది వారికి దక్షిణాదిలోని కొన్ని ఆచారాలు పూర్తిగా తెలియకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో వాటి గురించి వివరించడమే తన పని అని చెప్పారు.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మేనరికం వివాహాలు జరిగే సంప్రదాయం ఉందని, కేరళలో మాత్రం అలాంటి ఆచారం లేదని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

Details

రాధికా వ్యాఖ్యల వెనుక అసలు విషయం ఏంటి?

గతంలో తెలుగు సినిమాల్లో ఎదురైన అనుభవాల గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ.. తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం, మేనమామ పాత్రలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సన్నివేశాల్లో నటించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు.

సినిమా పేరు చెప్పకపోయినా ఈ వ్యాఖ్యలు 'లెజెండ్‌'ను ఉద్దేశించినవేనంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా కీర్తి వివరణ ఇచ్చినా వివాదం పూర్తిగా చల్లారలేదు.

కొందరు కీర్తికి మద్దతు ఇస్తుంటే, మరికొందరు రాధికా అసలు ఉద్దేశం హీరోయిన్ల పాత్రలు, వయసు తేడాల గురించేనని అంటున్నారు. దీంతో ఇద్దరి వ్యాఖ్యలను వేర్వేరుగా చూడాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాధికా వివాదంపై కీర్తి ఏం చెప్పిందంటే

ADVERTISEMENT