Revolver Rita: కీర్తి సురేశ్ మాస్ లుక్… 'రివాల్వర్ రీటా' ట్రైలర్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
అనేక విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'. కె. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్-కామెడీ థ్రిల్లర్ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సందర్భంగా చిత్రబృందం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్ 'రీటా' అనే సాధారణ మధ్యతరగతి యువతిగా నటిస్తున్నారు.
Details
ట్రైలర్ కు అద్భుత స్పందన
అయితే అనుకోని పరిణామాలు ఆమె చేతిలో రివాల్వర్ పట్టుకునే పరిస్థితిని తీసుకొస్తాయి. ఆ తర్వాత ఆమె ఎదుర్కొనే సవాళ్లు, సాహసాలు కథను ముందుకు నడిపే ప్రధాన అంశాలు. కామెడీ టచ్‌తో కూడిన పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా 'రివాల్వర్ రీటా' ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.