Revolver Rita Release Date : కీర్తి సురేష్ కొత్త అవతారం.. 'రివాల్వర్ రీటా' పోస్టర్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
'మహానటి' కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి స్పందన పొందింది. ఇక ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'రివాల్వర్ రీటా'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Details
విడుదల ఎప్పుడు?
మూవీ టీమ్ ప్రకటన ప్రకారం ఈ నెల 28న 'రివాల్వర్ రీటా' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో కీర్తి సురేష్ గులాబీని చేతిలో పట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉండగా, చుట్టూ ఉన్న రౌడీలు ఆమెపై గన్స్ గురిపెట్టే సన్నివేశం హైలైట్ అయింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాన్‌గా కీర్తి సురేష్ ? పోస్టర్, కథా నేపథ్యం చూస్తుంటే 'రివాల్వర్ రీటా' ఒక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. ఇందులో కీర్తి సురేష్ ఓ లేడీ డాన్ పాత్రలో కనిపించనున్నారని టాక్.
Details
సాంకేతిక, నటీనటుల వివరాలు
ఈ సినిమాకు జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్‌లీ కీలక పాత్రల్లో నటించారు. సినిమాను ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్ పై సుదన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను రాజేష్ దండా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు అదే రోజు, అంటే నవంబర్ 28న, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' కూడా విడుదల కానుంది. ఇందులో రామ్ ఓ హీరో అభిమానిగా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Details
కీర్తి బిజీ లైన్‌అప్
ప్రస్తుతం కీర్తి సురేష్ విజయ్ దేవరకొండతో కలిసి 'రౌడీ జనార్దన్' సినిమాలో నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయి షూటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆమె నటిస్తున్న 'అక్క' సినిమా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా రాబోతోంది, ఇందులో ఆమె పవర్‌ఫుల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనుంది. అలాగే మిస్కిన్ దర్శకత్వంలోని థ్రిల్లర్‌లోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మలయాళంలో 'తొట్టం' అనే సినిమాను కూడా ఇటీవలే ప్రకటించారు. ఇలా కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సతతంగా ప్రాజెక్ట్‌లతో బిజీగా కొనసాగుతున్నారు.