LOADING...
Mega 158 : మెగాస్టార్-బాబీ మూవీలో హీరోయిన్‌గా కేరళ బ్యూటీ 
మెగాస్టార్-బాబీ మూవీలో హీరోయిన్‌గా కేరళ బ్యూటీ

Mega 158 : మెగాస్టార్-బాబీ మూవీలో హీరోయిన్‌గా కేరళ బ్యూటీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో తెరకెక్కిన 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసేశారు. మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శంకర్ వరప్రసాద్ సినిమా చివరి షెడ్యూల్‌లో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు తోడుగా, మెగాస్టార్ మరో యంగ్ డైరెక్టర్ బాబీతో కాంబో కడతారని అఫీషియల్‌గా బర్త్ డే నాడు ప్రకటించారు. గతంలో ఈ కాంబోలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబీ-చిరు కాంబో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం నవంబర్ 5న పూజ కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది.

Details

చిరుకు జోడిగా మాళవిక మోహన్

ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీని సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ప్రసిద్ధి చెందిన మాళవిక మోహన్ ఇప్పుడు చిరు జోడిగా నటించనున్నారు. మాళవిక గతంలో తమిళ్ లో సీనియర్ హీరో విక్రమ్, మలయాళ స్టార్ మోహన్‌లాల్‌తో నటించి మెప్పించారని, ఇప్పుడు చిరుతో జోడిగా ప్రేక్షకులను అలరిస్తారని అంచనా వేస్తున్నారు. సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ నిర్మిస్తోంది. సినిమాటోగ్రాఫర్‌గా మిరాయ్ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుందని డైరెక్టర్ బాబీ తెలిపారు.