
Unni Mukundan: ఉన్ని ముకుందన్‌కు కేరళ కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్‌పై దాడి కేసులో నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారని తెలిసిందే. కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసి, అక్టోబర్ 27న హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో దాదాపు 10 నిమిషాల సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ టవర్ లొకేషన్లు పోలీసులు సేకరించి దర్యాప్తు పూర్తి చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టు సమన్లు జారీ చేసింది.
Details
సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదు
గతంలో వచ్చిన నివేదికల్లో ఉన్ని ముకుందన్ తన మాజీ మేనేజర్‌పై దాడి చేయలేదని, సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని పేర్కొన్న విషయం పోలీసులు ధృవీకరించారు. ఈ ఏడాది మే నెలలో విపిన్‌కుమార్ నటుడిపై దుర్భాషలాడినట్లు, దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్ని ముకుందన్ తనపై ఆరోపణలను గతంలోనే ఖండించి, ఎలాంటి దాడి చేయలేదని, తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఈ ఫిర్యాదు చేశారని తెలిపారు.