అక్కినేని హీరో కోసం కీర్తి సురేష్: ఈసారి విజయం ఖాయమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
దసరా సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్, మాంచి జోష్ మీదుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్ ఉంది.
ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో భోళాశంకర్ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది.
తాజా సమాచారం ప్రకారం మరో కొత్త తెలుగు సినిమాకు కీర్తి సురేష్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా, గుజరాత్ లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందట. ఈ చిత్రంలో నాగచైతన్య బోటు డ్రైవర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.
Details
గుజరాత్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా
ఈ సినిమాను కార్తికేయ 2 దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇదివరకు నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి.
అయితే తాజాగా రూపొందబోయే కొత్త సినిమాలో మొదటగా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా కీర్తి సురేష్ పేరు తెరమీదకు వచ్చింది. ఆల్రెడీ కీర్తి సురేష్ కు కథ వినిపించారని ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
థాంక్యూ, కస్టడీ సినిమాలతో అపజయాలు మూటగట్టుకున్న నాగచైతన్య, మంచి విజయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈసారి విజయాన్ని రుచి చూస్తాడేమో చూడాలి.
మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన రానుంది.