Gaddar Film Awards: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025: జ్యూరీలో కీలక మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉగాది సందర్భంగా అవార్డులను ప్రదానం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జ్యూరీ కమిటీలో తాజాగా ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నిర్వహించిన సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
సినిమా అవార్డుల ఎంపిక కమిటీ జ్యూరీ ఛైర్మన్ గా కి ప్రముఖ సంగీత దర్శకుడు
గద్దర్ పేరిట ప్రదానం చేస్తున్న ఈ సినిమా అవార్డులు వివిధ విభాగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేర్వేరు జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డుల ఎంపిక కమిటీకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత రెండు వారాలుగా ఆయన నాయకత్వంలో సభ్యులు సినిమాలను వీక్షిస్తూ పరిశీలిస్తున్నారు. ఉత్తమ సినీ విమర్శకుడు,ఉత్తమ సినిమా గ్రంథం విభాగాలకు తనికెళ్ళ భరణిని జ్యూరీ ఛైర్మన్‌గా నియమించారు. అలాగే బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్,డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వివరాలు
స్పెషల్ అవార్డ్స్ కమిటీలో ఛైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు
స్పెషల్ అవార్డుల కమిటీకి తొలుత కె. రాఘవేంద్రరావును ఛైర్మన్‌గా నియమించినప్పటికీ, తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయన స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమించారు. ఈ స్పెషల్ అవార్డ్స్ కమిటీలో ఛైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు కూడా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా గతంలో అమల్లో ఉన్న నంది అవార్డులకు బదులుగా ప్రజాగాయకుడు గద్దర్ పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు నిర్వహించబడుతున్నాయి. తెలుగు సినిమా రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన నటీనటులు,సాంకేతిక నిపుణులను గుర్తించి ఈ అవార్డులను అందజేస్తున్నారు. 2025లో తొలిసారిగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేయగా,2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు పురస్కారాలు ప్రకటించారు.
వివరాలు
ఉగాది రోజున అవార్డుల కార్యక్రమం
గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రభుత్వం ఇప్పటికే తేదీ నిర్ణయించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19న అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫిబ్రవరి 6 నుంచి సినిమాల స్క్రీనింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.