LOADING...
KGF Actor : క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్‌-2 నటుడు.. సాయం కోసం ఎదురుచూపులు
క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్‌-2 నటుడు.. సాయం కోసం ఎదురుచూపులు

KGF Actor : క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్‌-2 నటుడు.. సాయం కోసం ఎదురుచూపులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్-2 ఎంతటి స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ సినిమాలో నటించిన పలువురు నటులు అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా మరణించడం బాధాకరం. ఇటీవలే ముంబై డాన్ పాత్ర పోషించిన నటుడు కన్నుమూశాడు. ఇప్పుడు మరో కీలక నటుడు క్యాన్సర్ బారిన పడినట్టు తెలిసింది. అతను మరెవరో కాదు.. సినిమాలో హీరో వెన్నంటే ఉండి, ఎలివేషన్లు ఇచ్చే 'చాచా' పాత్రలో నటించిన హరీష్ రాయ్. కేజీఎఫ్‌లో ఆయన నటన, డైలాగ్‌లు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రంతో పాటు హరీష్ రాయ్ పలు సినిమాల్లో కనిపించినప్పటికీ, ఇప్పుడు అనుకోకుండా క్యాన్సర్‌కి గురై చికిత్స పొందుతున్నారు.

Details

ఒక్క ఇంజెక్షన్ ధర రూ.3.5 లక్షలు

హరీష్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఒక్క ఇంజెక్షన్ ధర రూ.3.5 లక్షలు. ఒక సైకిల్ చికిత్స కోసం మూడు ఇంజెక్షన్లు (రూ.10.5 లక్షలు) అవసరం అవుతాయి. మొత్తం చికిత్సలో 17 నుంచి 20 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందని, దాదాపు రూ.70 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇంత భారీ మొత్తం తన దగ్గర లేదని, సాయం చేయాలని ప్రజలను కోరుకున్నారు. ఆయన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. హరీష్ రాయ్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.