LOADING...
KGF Chacha: కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత

KGF Chacha: కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ నటుడు హరీశ్ రాయ్ ఇక లేరు. గత కొన్ని నెలలుగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. అనేక చిత్రాల్లో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన హరీశ్, 1995లో విడుదలైన 'ఓం' చిత్రంలో డాన్ రాయ్‌గా చేసిన పాత్రతో పాటు, 'కేజీఎఫ్'లో ఖాసిం చాచాగా చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా ఉంది. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన అనారోగ్య పరిస్థితిని స్వయంగా వెల్లడించిన హరీశ్, ఆ సమయంలో సహాయం కోరగా కొందరు ప్రముఖ నటులు ఆయనకు ఆర్థికంగా సాయం చేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

క్యాన్సర్ వల్ల నా గొంతు ఊపిరి పీల్చుకునే విధంగా వాచిపోయింది

"జీవితం ఎల్లప్పుడూ మనకు అనుకూలం కాదు. అదృష్టం ఎవరినీ వదిలిపెట్టదు. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. 'కేజీఎఫ్'లో నేను గడ్డంతో కనిపించడానికి కారణం ఇదే. క్యాన్సర్ వల్ల నా గొంతు ఊపిరి పీల్చుకునే విధంగా వాచిపోయింది. అది బయటకు కనిపించకుండా ఉండేందుకు గడ్డం పెంచుకున్నాను" అని గతంలో హరీశ్ తన పరిస్థితిని వివరించారు.