
Dinesh Mangaluru: కేజీఎఫ్ విలన్ దినేష్ మంగళూరు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కేజీఎఫ్ చిత్రంలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ మంగళూరు (దినేష్ కెవి పాయ్) ఇక లేరు. ఆగస్ట్ 25న కుందాపూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 'ఆ డింగి', 'కేజీఎఫ్', 'ఉలిదవరు కందంటే', 'కిచ్చా', 'కిరిక్ పార్టీ' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన, కన్నడ చిత్రసీమలో అత్యధిక డిమాండ్ కలిగిన సహాయ నటుల్లో ఒకరుగా నిలిచారు. అనేక సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దినేష్ మంగళూరుకు సినీ రంగంలో అపారమైన అనుభవం ఉంది.
Details
కాంతార మూవీ షూటింగ్ స్ట్రోక్
'కాంతారా' చిత్రీకరణ సమయంలో ఆయనకు ఒక్కసారిగా స్ట్రోక్ రావడంతో బెంగళూరులో చికిత్స పొందారు. కోలుకున్నప్పటికీ, గతవారం నుంచి ఆయన మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. అంకడకట్టే సర్జన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సోమవారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. 1964లో జన్మించిన ఆయన అసలు పేరు 'దినేష్ కలససి వెంకటేష్ పాయ్'. అయితే, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత 'దినేష్ మంగళూరు' అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, యాక్టింగ్ శిక్షణ పొందిన అనంతరం సినిమాలలోకి ప్రవేశించారు. దినేష్ మంగళూరుకు మరణవార్త తెలిసి కన్నడ చిత్ర పరిశ్రమలోని పలువురు కళాకారులు, సహచరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.