Page Loader
KH 234: కమల్-మణిరత్నం మూవీ టైటిల్‌పైనే అందరి ఫోకస్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
కమల్-మణిరత్నం మూవీ టైటిల్‌పైనే అందరి ఫోకస్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల

KH 234: కమల్-మణిరత్నం మూవీ టైటిల్‌పైనే అందరి ఫోకస్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సినిమా దిగ్గజాలు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్‌లో 'KH 234' వర్కింట్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. కమల్, మణిరత్నం దాదాపు 35ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 7(మంగళవారం)న కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధంచిన అప్డేట్లను చిత్ర బృందం ఇస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. అంతేకాకుండా నేడు సాయంత్రం 5గంటలకు కమల్ హాసన్, మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్ చేసింది. టైటిల్ ప్రకటన ద్వారా కమల్ హాసన్ తన పుట్టినరోజు కానుకను ఒకరోజు ముందుగానే అభిమానులు ఇస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాయంత్రం 5గంటలకు టైటిల్ ప్రకటన

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్ట్ లుక్ పోస్టర్