Khel Khatam Darwaja Bandh: 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ లుక్ లాంచ్
"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి ప్రత్యేక చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని రానా తెలిపారు. ఈ మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ అందించారు.
నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి
"ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా హిలేరియస్ ఫన్ రైడ్‌గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.రాహుల్ విజయ్, నేహా పాండే,అజయ్ ఘోష్,మురళీధర్ గౌడ్,గెటప్ శ్రీను,రచ్చ రవి,రవివర్మ,గంగవ్వ,జయశ్రీ తదితరులు నటిస్తున్నఈ సినిమాకి కాస్ట్యూమ్స్-స్ఫూర్తి రావు,ఆర్ట్ డైరెక్టర్-మోహన్ జి,కొరియోగ్రఫీ - ఈశ్వర్ పెంటి అందిస్తున్నారు. ఉదయ్ కుమార్ డి ఎడిటర్‌గా, కార్తీక్ కొప్పెర డీవోపీగా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ రెడ్డి కడదూరి ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.