Kushi Kapoor: శ్రీదేవి 'మామ్' సీక్వెల్‌లో ఖుషీ కపూర్.. బోనీ కపూర్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఖుషి కపూర్ (Kushi Kapoor) తన తల్లి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చివరి చిత్రమైన 'మామ్' (MOM) సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) ఐఫా వేడుకలో వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో ఖుషి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నారు.
శ్రీదేవిని గుర్తుచేసుకున్న బోనీ కపూర్
ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్న బోనీ కపూర్ తన భార్య శ్రీదేవిని స్మరించుకుంటూ, తన కుమార్తెల గురించి మాట్లాడారు. "తల్లిలానే జాన్వీ, ఖుషీలు కూడా నటనలో మంచి గుర్తింపు పొందాలని తెలిపారు.
Details
శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'
మామ్ 2' గురించి మాట్లాడుతూ ఖుషి నటనపై తనకు పూర్తి నమ్మకం ఉందని, 'ఆర్చీస్', 'లవ్ యాపా' చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించిందన్నారు.
త్వరలోనే తాను ఆమెతో ఓ సినిమా చేయనున్నానని, అది 'మామ్ 2' కావొచ్చని తెలిపారు.
2017లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో విడుదలైన 'మామ్' చిత్రంలో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించారు.
ఇందులో శ్రీదేవి నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు లభించాయి. ఆమె మరణానంతరం ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు బోనీ కపూర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖుషి కపూర్ ఇందులో ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.